ఈ తరం హాస్య నటులలో ప్రేక్షకులను మెప్పిస్తూ  రాణిస్తున్న ‘సత్య’

Spread the love

మన తెలుగు సినిమాల్లో 60వ దశాబ్దం నుంచి ఇప్పటి వరకు బెస్ట్ కమెడియన్స్ అంటే టక్కున రాజా బాబు, పద్మనాభం, అల్లు రామలింగయ్య, రేలంగి, బ్రహ్మానందం, ms నారాయణ, రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ, బాబు మోహన్, కోట శ్రీనివాస రావు, వెన్నెల కిశోరం వేణు మాధవ్… ఇలా చాల నేమ్స్ వినిపిస్తాయి… మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరు ఉన్నారు??? అరేయ్ సత్య డామినేట్ చేస్తున్నాడు కదా సినిమాల్లో అనిపిస్తుంది… అందుకే సత్య కి ఇప్పుడు గోల్డెన్ డేస్ అనమాట…కథ ఎలా ఉన్నా, సీన్ ఎంత బలహీనంగా ఉన్నా, కమెడియన్స్  ప్రెజెన్స్ సినిమాను మోసుకెళ్లిన సందర్భాలు వందలు కాదు… వేలల్లో ఉన్నాయి. కానీ నేటి తరం టాలీవుడ్‌లో ఆ వాతావరణం కనిపించడం లేదు అన్నది కఠినమైన నిజం.ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రత్యేకమైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించగలిగే నటులు కొందరే. అందులో సత్య లాంటి కమెడియన్లు తమ ఉనికిని గట్టిగా చాటుకోవడం దర్శకులకు నిజంగా పెద్ద ప్లస్ అవుతోంది.ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో సత్య ఉండటం గమనార్హం. ‘రాజా సాబ్’లో అతనికి పెద్ద స్కోప్ లేకపోయినా, దొరికిన స్పేస్‌లోనే నవ్వించే ప్రయత్నం బాగానే వర్కౌట్ అయ్యింది. టైటిల్ కార్డు మొదలయ్యేదే సత్యతో అన్న విషయం అతని ప్రాధాన్యాన్ని చెబుతుంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సన్నివేశాల్లో ఆశికా రంగనాథ్‌కు అసిస్టెంట్‌గా అతి వినయంతో చేసే హంగామా మంచి కామెడీ పండించింది.‘నారి నారి నడుమ మురారి’లో ఆటో డ్రైవర్ పాత్ర నిడివి తక్కువే అయినా, నరేష్‌తో పోటీపడి కొన్ని సీన్లలో నిజంగా హిలేరియస్‌గా నిలిచాడు. ఇక ఇవాళ రిలీజ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’ టీజర్‌ను హీరో వరుణ్ తేజ్ కంటే ముందే సత్యతో ఓపెన్ చేయడం… మేకర్స్ అతనికి ఇస్తున్న విలువకు స్పష్టమైన ఉదాహరణ.ఇంతకే కాదు… ‘జెట్లీ’ టైటిల్‌తో ఏకంగా ఒక కామెడీ యాక్షన్ మూవీలో హీరోగా కూడా మారుతున్నాడు సత్య. అతని పేరు మీదే బిజినెస్ జరిగే స్థాయికి చేరుకోవడం చిన్న విషయం కాదు. గతంలో ‘వివాహ భోజనంబు’లో లీడ్ రోల్ చేసినా, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కావడంతో థియేటర్ ఆడియన్స్‌కు పూర్తిగా రీచ్ కాలేదు. కానీ ‘జెట్లీ’ విషయంలో మాత్రం మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.షూటింగ్ స్టేజ్ నుంచే పబ్లిసిటీ మొదలైంది. చెప్పాలంటే కొంచెం అతిశయోక్తిలా అనిపించొచ్చు గానీ, సరైన ఫోకస్, కరెక్ట్ సినిమాలు పడితే… సత్య కూడా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ లాంటి ప్రామిసింగ్ కామెడీ ఆర్టిస్టుగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి లాంటి దర్శకుల చేతిలో పడితే అతని టాలెంట్ మరింత మెరుగు పడేది. ఆ కోణంలో చూస్తే… ‘మన శంకర వర ప్రసాద్ గారు’ లాంటి సినిమాను మిస్ అవడం మాత్రం సత్యకు చిన్న లోటే అనిపిస్తుంది.