టాలీవుడ్ లో ఆస్కార్ దక్కించున్న ఏకైక సంగీత దర్శకుడు కీరవాణికి మరో అరుదైన గౌరవం దక్కింది. మన ‘వందే మాతరం’ గేయాన్ని అయన మళ్ళి కంపోజ్ చేయనున్నారు… అసలు “వందే మాతరం…” పదం వినగానే, మనలోని మన దేశ భక్తి పొంగుకువస్తుంది… ఇది మన దేశం… ఇది మన నెల అని ఎంతలా ఉప్పొంగిపోతామో కదా… మరి ఈ పాట కి ఉన్న స్థాయి అలాంటిది…ఈ చారిత్రక గీతం 150 ఏళ్ల వర్షోకోత్సవం సందర్బంగా, మళ్ళి ఈ రిపబ్లిక్ డే నాడు అంటే జనవరి 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కీరవాణి తన బృందంతో కలిసి ఈ గీతాన్ని ఆలపించనున్నారు. ఈ అవకాశం తన జీవితంలో అపూర్వమైన గర్వకారణమని ఆయన భావోద్వేగంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.“ఐకానిక్ గేయం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఢిల్లీ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో దీన్ని పాడే అవకాశం లభించింది. ఇది నాకు లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దేశం నలుమూలల నుంచి ఎంపికైన సుమారు 2,500 మంది కళాకారులు ఈ మహా ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఆ రోజుకై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అని చాల ఎమోషనల్ గా సంతోషంగా ఈ విషయాన్నీ కీరవాణి నెటిజన్స్ కి తెలిపారు…ఒకే వేదికపై 2,500 మంది కళాకారుల తో ఈ గీతం వినిపించనుండటంతో ఈ కార్యక్రమంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విశేష ఆసక్తి నెలకొంది. బంకించంద్ర ఛటర్జీ 1885లో రచించిన ఈ దేశ భక్తి గేయానికి గతేడాది నవంబర్ 7తో 150 ఏళ్లు పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే.