అసలు మన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఏంటి ఈ కాంట్రవర్సీ అనిపిస్తుంది… గత వారం రోజులుగా బాలీవుడ్ మొత్తం మన రెహమాన్ సర్ వెనక పడ్డారా అని కూడా అనిపిస్తుంది… దీనికి కారణం AR రెహమాన్ BBC ఇంటర్వ్యూ లో పవర్ షిఫ్ట్ ఇంకా communal remarks చేయడమే కదా… ఆ తరవాత రెహమాన్ నేను మాట్లాడింది తప్పే అని ఒక వీడియో మెసేజ్ కూడా official గా రిలీజ్ చేసినా ఇంకా ఈ కాంట్రవర్సీ చల్లారడం లేదు!రీసెంట్ గా తస్లిమా నస్రీన్ కూడా ఆర్ రెహమాన్ పై జాలిపడటం తగదు అని చెప్పింది… ఇంకా తాను ఏమి చెప్పింది అంటే… ‘‘ఏఆర్ రెహమాన్ భారత్‌లో చాలా పేరుపొందిన వ్యక్తి. నాకు తెలిసినంతవరకు ఆయన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. సంపన్న సంగీతకారుడు ఆయనే కావచ్చు. మతపరమైన కారణాలతో బాలీవుడ్‌లో పని దొరకడం లేదని ఆయన చెప్పారు. కానీ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావెద్ అక్తర్.. వీళ్లంతా సూపర్‌స్టార్స్. ఫేమస్ వ్యక్తులు, సంపన్నులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. వారు ఏ మతానికి, ఏ సామాజిక వర్గానికి చెందినవారైనా సరే. నాలాంటి పేదలకే కష్టాలు ఉంటాయి. ఇటువంటివి ఏఆర్ రెహమాన్ దారిదాపుల్లోకి కూడా రావు. అన్ని మతాల వారు ఆయన్ను గౌరవిస్తారు. ఆయన్ను చూసి జాలిపడటం తగదు”.సో, ఈ వివాదం ఇప్పటిలో ముగిసేలా కనిపించడం లేదు… ఇంతకూ ముందు కూడా బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్, షాన్, జావేద్ అఖ్తర్ లాంటి వెళ్లి బహిరంగంగానే AR రెహమాన్ ని విమర్శించారు.