ఇప్పుడేమో సంక్రాంతి సినిమాల సందడిని చూసి… “ఇంతకంటే పెద్ద క్లాష్ ఇంకేదుంటుంది?” అనిపిస్తోంది. కానీ నిజంగా చెప్పాలంటే అసలైన బాక్సాఫీస్ యుద్ధం మార్చిలోనే జరగబోతోంది. సంక్రాంతికి జరిగిన పోటీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో కాదు. బడ్జెట్ పరంగా చూస్తే రాజా సాబ్ స్పష్టంగా డామినేట్ చేసింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ప్లాప్దే టాక్ తెచ్చుకుంది… ఇంకా అదే సమయంలో రికార్డులు, వసూళ్ల పరంగా మన శంకర వర ప్రసాద్ గారు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది!అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వాటి స్థాయి, కలెక్షన్ల వ్యాప్తి మీడియం రేంజ్‌కే పరిమితమయ్యాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సక్సెస్ ముద్ర వేసుకుని బయటకొచ్చింది. ఇక నెక్స్ట్ రిపబ్లిక్ డే కి కొన్ని సినిమాలే లైన్ లో ఉన్నాయ్… ఆల్మోస్ట్ సంక్రాంతి సినిమాల హవా కొనసాగే సూచన ఉంది! ఇంకా నెక్స్ట్ 29th కి డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ల ఓం శాంతి శాంతి శాంతి సినిమా రిలీజ్ అవ్వబోతోంది. కామెడీ సినిమా కాబట్టి, సంక్రాంతి సినిమాల తరవాత వచ్చే కొత్త సినిమా కాబట్టి, కొంచం హైప్ ఉంది. చిన్న సినిమాలు ఎప్పుడైనా సడన్ హిట్ కొట్టచ్చు కదా! సో, ఈ మంత్ కోట అయ్యింది… నెక్స్ట్ ఫిబ్రవరి… స్టార్టింగ్ లోనే గుణశేఖర్ యుఫొరియా లైన్ లో ఉంది… నెక్స్ట్ వాలెంటైన్స్ డే సందర్బంగా వచ్చే విశ్వక్ సేన్ ఫంకీ… ఇలా ఫిబ్రవరి కూడా మంచి ఫన్ ఉండే సినిమాలు వస్తున్నాయి…కానీ ఇవన్నీ కాదు… అసలు మజా మాత్రం సినిమా ప్రేమికులకు మార్చి నెలలోనే మొదలవ్వనుంది. మార్చి 19 న యష్ – టాక్సిక్. అడివి శేష్ – డెకాయిట్ రావాల్సిందే అన్నది ఫిక్స్ అయింది. టీజర్లోనే ఆ విషయం క్లియర్‌గా చెప్పేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం రానుంది. ఇవి రిలీజ్ అయిన వారం తర్వాతే రామ్ చరణ్ – పెద్ది రంగంలోకి దిగుతుంది. అవకాశం వచ్చిన ప్రతిసారి హీరోతో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా మార్చి 27 విడుదల అని గట్టిగానే చెబుతున్నారు. ఇక నాని – ప్యారడైజ్ మార్చి 26నే థియేటర్లలోకి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పోస్ట్‌పోన్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఒకవేళ ఈ సినిమాలన్నీ అనుకున్న తేదీలకే వస్తే… 2026 మార్చి నెల బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికన్నా పెద్ద సునామీ సృష్టించడం ఖాయం అన్న మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.ఇవన్నీ కాకుండా మార్చ్ లోనే ఎగ్జామ్స్ ఉన్నాయ్… ఇంకా IPL కూడా ఉంది… ఈసారి IPL సీజన్ 26 March to 31 May 2026 సో సినిమాలు ఈ క్రికెట్ సీసన్ తో పోటీ పడాల్సిందే కదా.