సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు

Spread the love

బీ.ఆర్.ఎస్. సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. నేడు జూబ్లీహిల్స్ పీఎస్ కు చేరుకున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని హరీశ్ రావుకు సోమవారం సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన జిల్లా పర్యటనలో ఉండటంతో సిట్ సిబ్బంది నోటీసులను కోకాపేటలోని ఆయన ఇంట్లో ఇచ్చి వెళ్లారు.దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక టర్న్ లు తిరుగుతున్న సంగతి విదితమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో  రాజకీయ నాయకులు, వ్యాపారులు మొదలు జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చిలో కేసు నమోదైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని హరీష్ రావు  అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. సీఎం  ఆడుతున్న సిల్లీ డ్రామా ఇది అని వ్యాఖ్యానించారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కోకాపేటలో మాజీ మంత్రి కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.