భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Spread the love

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు క్వార్టర్స్ రిజల్ట్స్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా ట్రేడింగ్ పై ప్రభావం చూపాయి. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్  సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో  81,537 వద్ద ముగిసింది. నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 25,048 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 91.85 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో ఎటర్నల్, ఇండిగో, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాలతో ముగించాయి. అమెరికా-యూరప్ దేశాల మధ్య వాణిజ్య టారిఫ్ ల అంశం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడం, రూపాయి విలువ కనిష్ఠానికి చేరువ కావడం వంటి ఒడిదుడుకులు మార్కెట్ లో కనిపించాయి.