కేరళకు కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ తో మరింత మెరుగైన ప్రయాణ సౌలభ్యం లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు 4 రైళ్లను ప్రారంభించారు: తిరువనంతపురం – చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, తిరువనంతపురం – తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయిల్ – మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, త్రిసూర్ – గురువాయూర్ ప్యాసింజర్ రైలు అందులో ఉన్నాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ రైళ్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. తిరువనంతపురం-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చనుంది. అలాగే, తిరువనంతపురం-తాంబరం ట్రైన్ తమిళనాడులోని ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ సెంటర్లకు అనుసంధానంగా ఉంటుంది. అమృత్ భారత్ ట్రైన్స్ ను సామాన్యులకు తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు అందించేలా రూపొందించారు. ఇవి నాన్-ఏసీ ట్రైన్స్ అయినప్పటికీ, వీటిలో ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు ఫోన్ చార్జర్ సాకెట్, బాటిల్ హోల్డర్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఈ ట్రైన్స్ లోని సౌకర్యాల పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక నేడు కేరళలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నేడు కేరళలో ప్రారంభించబడుతున్న అభివృద్ధి పనులు కేరళ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని అనుసంధానతను మెరుగుపరుస్తాయని మరియు ప్రజలకు కొత్త అవకాశాలను కల్పిస్తాయన్నారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు.