బంగ్లాదేశ్ కు మరో గట్టి షాక్ తగిలింది. ఆ దేశ జర్నలిస్టులు భారత్ కు రావడానికి వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది. భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ భద్రతా కారణాలను సాకుగా చూపి చివరకు టోర్నీకే దూరమైన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు అదే కారణాన్ని చూపుతూ బంగ్లాదేశ్ జర్నలిస్టులు భారత్ రావడానికి వీసాలు నిరాకరించారు. ఈ విషయాన్ని ఐసీసీ వర్గాలు ధ్రువీకరించాయి. భారత్ కు రావడం సురక్షితం కాదని బంగ్లా ప్రభుత్వం చెబుతూనే ఉంది. దీంతో బంగ్లా జర్నలిస్టులకు వీసాలు ఇవ్వలేదని ఐసీసీ అధికారి ఒకరు జాతీయమీడియాతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ మీడియా ప్రతినిధులు విచారం వ్యక్తంచేస్తున్నారు. శ్రీలంకలో జరిగే టీ20 మ్యాచ్ల కవరేజీపై కూడా దీని ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్ లు శ్రీలంకలో షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.