ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో గుజరాత్ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలుపొందింది.బెత్ మూనీ (58; 46 బాల్స్ లో 7×4),అనుష్క శర్మ (39; 25 బాల్స్ లో 8×4) రాణించారు. దీంతో మొదట గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రీచరణి (4/31) మంచి ప్రదర్శన కనబరిచింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 8 వికెట్లకు 171 పరుగు చేయగలిగింది. నిక్కీ ప్రసాద్ (47; 24 బాల్స్ లో 9×4) టాప్ స్కోరర్. సోఫీ డివైన్ (4/37), రాజేశ్వరి గైక్వాడ్ (3/20) బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. స్నేహ్ రాణా (29; 15 బంతుల్లో 3×4, 2×6) కూడా బ్యాట్ తో ధాటిగా ఆడింది. చివరి రెండు ఓవర్లలో ఢిల్లీకి 29 పరుగులు అవసరం కాగా.. స్నేహ్ వరుసగా 6, 4 4, నిక్కీ ఓ ఫోర్ కొట్టడంతో 19వ ఓవర్లో గార్డ్నర్ 20 పరుగులు ఇచ్చింది. నిక్కీ, స్నేహ జోరు చూస్తుంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయడం దిల్లీకి కష్టం కాదనిపించింది. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన సోఫీ డివైన్.. 5 పరుగులే ఇచ్చి స్నేహ్, నిక్కీలను ఔట్ చేసింది.
గుజరాత్ ఇన్నింగ్స్: 174/9 (బెత్ మూనీ 58, అనుష్క 39, తనూజ 21;
ఢిల్లీ ఇన్నింగ్స్: 171/8 (నిక్కీ ప్రసాద్ 47, స్నేహ్ రాణా 29, వోల్వార్ట్ 24.