అజిత్ పవార్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమత

Spread the love

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు జరిగిన విమానప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆయన మృతిలో కుట్ర కోణం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. పవార్ మరణ వార్త విని దిగ్బ్రాంతికి లోనైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం దేశంలోని రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఇన్విస్టిగేట్ చేయాలని అన్నారు. సుప్రీం కోర్టుపైన మాత్రమే తమకు విశ్వాసం ఉందని మరే ఇన్వెస్టిగేషన్ సంస్థపైనా నమ్మకం లేదని అన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ బీజేపీని వీడాలని ఆలోచిస్తున్నారన్న ప్రచారం గురించి ప్రస్తావించారు. అజిత్ పవార్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు తమ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ లో నేతలు, వివిధ రంగాల ప్రముఖులు  తమ సంతాపం తెలిపారు.