విశ్వక్ సేన్ ‘ఫంకీ’ పై అంచనాలు పెంచిన డైరెక్టర్ అనుదీప్

Spread the love

అనుదీప్… ఈ దర్శకుడి పేరు వినగానే మనకి నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ నటించిన ‘జాతి రత్నాలు’ సినిమా గుర్తుకు వస్తుంది. ముగ్గురు ఫ్రెండ్స్ హైదరాబాద్ కి వచ్చి ఎలా బ్రతికారో అనేది కథ… కానీ నవీన్ అతి తెలివి, ప్రియదర్శి అమాయకత్వం, రాహుల్ తాగుబోతు క్యారెక్టర్స్ సూపర్ అనిపించాయి. ఇక మన శ్రీకాంత్ చిట్టి ప్రేమలో పడేసరికి కథ మంచి U టర్న్ తీసుకుని, రాజకీయాలు ముడి వేయడం ఆమ్మో ఎంత ఫన్నీ గా చుపించారో. ఇక ఇప్పుడు అదే దర్శకుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నా విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు… అందుకే ఈ సినిమా కూడా ఫుల్ ఫన్నీ గా ఉంటుంది అంటున్నారు. రిలీజ్ డేట్ ఈ వాలెంటైన్స్ డే నే కాబట్టి, టీం అంత ఫుల్ ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్నారు! ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడం వెనుక అనుదీప్ ప్రొమోషన్స్ అంటున్నారు జనాలు! కామెడీని హ్యాండిల్ చేసే విషయంలో అనుదీప్ స్టైల్ కాస్త డిఫరెంట్. కథలోకి చురుకైన వన్‌లైనర్లు, ఊహించని డైలాగ్‌లు, సడన్‌గా పేలే ఫన్నీ సిట్యుయేషన్లను కలపడం అతని ట్రేడ్‌మార్క్. అందుకే స్లాప్‌స్టిక్ ఎంటర్‌టైనర్ల విషయంలో అనుదీప్‌కు ఒక ప్రత్యేక లీగ్ ఏర్పడిందని చెప్పాలి. కేవలం రచయితగా మాత్రమే కాదు… మీడియా ఇంటర్వ్యూలు, పబ్లిక్ అపియరెన్సుల్లో కూడా అనుదీప్ చేసే ఫన్నీ చేష్టలు అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. మాట్లాడే విధానం, సమాధానాలు చెప్పే స్టైల్, మధ్య మధ్యలో వేసే షార్ప్ పంచ్‌లు… ఇవన్నీ కలిసి అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ చేశాయి. ఇప్పుడు అదే స్వభావం అతడి రాబోయే సినిమా ‘ఫంకీ’కి పెద్ద ప్లస్‌గా మారుతోంది. ఇటీవలే ప్రముఖ యాంకర్ సుమ నిర్వహించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు అనుదీప్‌తో పాటు హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ కాయదు లోహర్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ విడుదలైన వెంటనే… సోషల్ మీడియా అంతా అనుదీప్ కామెడీ టైమింగ్ గురించిన చర్చలతో నిండిపోయింది. అసలు సుమ – అనుదీప్ కాంబినేషన్ అంటేనే నవ్వులు గ్యారెంటీ అన్న పేరుంది. గతంలో ఎన్నో సందర్భాల్లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడు ‘ఫంకీ’ ఇంటర్వ్యూ ఆ హిలేరియస్ కాంబినేషన్‌ను మళ్లీ గుర్తు చేసింది. అనుదీప్ ఇచ్చిన వింత సమాధానాలు, సరదా వ్యాఖ్యలు, సెల్ఫ్ ట్రోలింగ్ తరహా పంచ్‌లు ఈ మొత్తం ఇంటరాక్షన్‌ను చాలా ఎంటర్‌టైనింగ్‌గా మార్చాయి. ముఖ్యంగా సుమ ప్రశ్నలకు అనుదీప్ ఇచ్చే కౌంటర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఇంటర్వ్యూలోని అనేక వీడియో బైట్స్ ప్రస్తుతం వైరల్ అవుతూ… సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.రిలీజ్‌కు ముందు పెద్ద ప్రమోషన్‌లు లేకపోయినా… ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఇంత హైప్ రావడం ‘ఫంకీ’ టీమ్‌కు కలిసి వస్తోంది. కామెడీనే ఆయుధంగా చేసుకుని అనుదీప్ ఈసారి కూడా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నంలో ఉన్నాడని ఈ ఇంటర్వ్యూతోనే అర్థమవుతోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈసారి కూడా అనుదీప్ తన ప్రత్యేకమైన హ్యూమర్‌తో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో… ఫిబ్రవరి 13న థియేటర్లలో తేలాల్సిందే.