హెచ్-1బి వీసాలకు సంబంధించి టెక్సాస్ గవర్నర్ కీలక ఆదేశాలు

Spread the love

అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కొత్త హెచ్-1బి వీసాల దరఖాస్తులు వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, రాష్ట్ర ఏజెన్సీలకు లేఖ రాశారు. 2027 మే 31వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. కాలిఫోర్నియా తరువాత హెచ్-1బి హోల్డర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం టెక్సాసే. ఇక హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగం అవుతుందని అబాట్ ఆరోపించారు. అమెరికన్ ఉద్యోగాలు ఆ దేశ పౌరులకే దక్కాలని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్-1బి వీసా దుర్వినియోగం అవుతున్నట్లు నివేదికలు అందినట్లు తెలిపారు. అమెరికన్ ఉద్యోగాలు దేశ ప్రజలకే వెళ్తున్నాయని కన్ఫర్మ్ చేసుకునేందుకు సమీక్ష జరుగుతుంది. ఈ క్రమంలో కొత్త వీసా పిటిషన్లను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఏజెన్సీలకు రాసిన లేఖలో అబాట్ పేర్కొన్నారు. టెక్సాస్ కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనం కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన అమెరికన్లను నియమించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ విదేశీ ఉద్యోగులను నియమించుకుని కొందరు ఆ వీసా ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పన్ను చెల్లింపుదారులతో కూడిన నియమాకాలతో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.