నాలుగో టీ 20లో న్యూజిలాండ్ గెలుపు 

Spread the love

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ 62 (36; 7×4, 3×6), డెవాన్ కాన్వే 44 (23; 4×4, 3×6), మిచెల్ 39 నాటౌట్ (18; 2×4, 3×6) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 2వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, బుమ్రా, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలలో  165 పరుగులకే ఆలౌటైంది.   శివమ్ దూబే 65 (23;3×4, 7×6) భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. రింకు సింగ్ 39 (30; 3×4, 2×6), సంజూ శాంసన్ 24 (15; 3×4, 1×6) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్ 3వికెట్లు, డఫీ 2వికెట్లు, ఇషీ సోధీ 2వికెట్లు,ఫోక్స్, హెన్రి ఒక్కో వికెట్ పడగొట్టారు.