కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Spread the love

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. పవన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, అలాగే ప్రజా మరియు పరిపాలనాపరమైన పలు ముఖ్యమైన అంశాలపై మేము సుదీర్ఘంగా చర్చించారు. ఉప్పాడ సముద్ర తీర రక్షణ గోడ (Uppada Sea Protection Wall) ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సాంకేతిక సలహా కమిటీ ముందు సమర్పించేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగానికి అవకాశం కల్పించినందుకు గాను, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. విశాఖతోపాటు విశాఖ పరిసర జిల్లాల్లో మూడు రోజలపాటు పర్యటిస్తారు.