అంచనాలకు తగ్గట్లుగానే ‘విశ్వంభర’..అద్భుతంగా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ టాక్

Spread the love

మన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంతకు ముందే రిలీజ్ అవ్వాల్సిన విశ్వంభర సినిమా ఎప్పుడు వస్తుంది. ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ‘విశ్వంభర’ విడుదల ఆలస్యం ఉన్నప్పటికీ, ఈ సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టాక్, ఫస్ట్ రివ్యూ తరహా సమాచారం బయటకు రావడంతో… అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సినిమా అవుట్‌పుట్ అసాధారణంగా ఉందని, విజువల్స్ పరంగా పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలవడమే కాకుండా, నాన్–పాన్ ఇండియా సినిమాల విభాగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విజయం ద్వారా చిరంజీవి తన స్టార్ పవర్ ఇప్పటికీ తగ్గలేదని, మార్కెట్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించారు. ఈ సక్సెస్ జోరులోనే ఆయన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వంభర’ చిత్రం ఒక సోషియో–ఫాంటసీగా రూపొందింది. షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికీ, గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. అయితే ‘విశ్వంభర’ కి సంబంధించిన ఇంటర్నల్ ఫీడ్‌బ్యాక్, ఫస్ట్ రివ్యూ లాంటి సమాచారం. సినిమా అవుట్‌పుట్ అదిరిపోయిందని, ముఖ్యంగా విజువల్స్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తాయని అంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఈ స్థాయి విజువల్స్ చూడలేదని, హాలీవుడ్ స్థాయి విజువల్ ట్రీట్‌గా ఈ సినిమా నిలుస్తుందని టాక్. ‘విశ్వంభర’ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఫాంటసీ వరల్డ్‌ను స్క్రీన్‌పై చూపించే విధానం పూర్తిగా కొత్తగా ఉంటుందట. సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని సమాచారం. బిజినెస్ పరంగానూ ఈ సినిమాకు మంచి అవకాశాలున్నాయి. ఒకసారి వర్క్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ మొదలైతే, బిజినెస్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ భారీ విజయం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చెప్పాలి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మొత్తానికి… టీమ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ సినిమా విడుదలైతే బ్లాక్‌బస్టర్ అనేది దాదాపు ఖాయం.