పేపర్ ప్లేట్ పై బ్యాంక్ ఎకౌంట్ వివరాలు…డేటా ప్రైవసీపై నెటిజెన్ల ఆందోళన

Spread the love

ఈ ఆధునిక యుగంలో డేటా ప్రైవసీపై ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తమయ్యే సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక తినుబండారాలు అమ్మే దగ్గర పేపర్ ప్లేట్ పై బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండడం కలకలం రేపుతోంది. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిని షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో వ్యక్తిగత డేటా గోప్యతపై నెటిజన్లు ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. moronhumor అనే ‘ఎక్స్’ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్న పేపర్ తో  తయారుచేసిన పేపర్ ప్లేట్ ఫొటోను ఒక నెటిజన్ పోస్ట్ చేశారు. ఇందులో పేరు, లొకేషన్, చెల్లింపు వంటి వివరాలు రాసి ఉన్నాయి. ఇదీంతో డేటా ప్రైవసీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.వినియోగదారుల  వివరాలు ఉన్న కాగితాలు ఇలా బహిరంగంగా కనిపిస్తుండడం పట్ల నెటిజన్లు పలువురు  ఆందోళన వ్యక్తంచేశారు.