కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గత కొద్ది రోజులుగా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లి ఖార్జున్ ఖర్గేలతో ఆయన సమావేశమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి మరియు లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. ఈరోజు అనేక అంశాలపై మా మధ్య జరిగిన చర్చ ఎంతో ఆత్మీయంగా, నిర్మాణాత్మకంగా సాగింది. భారత ప్రజల సేవలో మేమంతా ఏకతాటిపై ముందుకు సాగుతున్నామంటూ ఆయన ‘ఎక్స్’ లో ఈ భేటీకి సంబంధించిన ఫోటోను షేర్ చేసుకున్నారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్ పలు సార్లు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది.