దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’.ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల అంటూ ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఎస్.ఎస్.రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశారు. తెలుగునాట ఉగాది, ఉత్తర భారతంలో గుడి పడ్వా పండుగలు ఆ తేదీనే రావడం కూడా చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. పురాణాలు, కాల ప్రయాణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.