ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన జకోవిచ్ 

Spread the love

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆల్ టైమ్ రికార్డు వేటలో దూసుకుపోతున్న సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఐదు గ్రాండ్ స్లామ్ ల తరువాత ఫైనల్ చేరాడు. తాను రికార్డుస్థాయిలో 10 టైటిల్స్ సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండేళ్ల విరామం తర్వాత ఫైనల్ కు అర్హత సాధించాడు. తాజాగా ప్రపంచ నెంబర్ 2 ఇటలీ టెన్నిస్ సూపర్ స్టార్ యానిక్ సిన్నర్ పై 6-3, 4-6, 6-4, 6-4తో అద్భుత గెలుపును కైవసం చేసుకున్నాడు. జకోవిచ్ చివరిగా 2024 వింబుల్డన్ లో గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరాడు. ఇక మరో కీలక గేమ్ లో స్పెయిన్ సంచలనం  ప్రపంచ నెంబర్ వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాస్ 6-4, 7-6 (7-5), 6-7 (4-7), 7-5తో జర్మనీకి చెందిన జ్వెరెవ్ పై విజయం సాధించాడు. ఇక ఆస్ట్రేలియా ఓపెన్ మిక్సెడ్ డబుల్స్ టైటిల్ ను ఒలీవియా గడెకి, జాన్ పీర్స్ జోడీ గెలుచుకుంది. పోటాపోటీగా జరిగిన ఫైనల్ లో ఈ ఆస్ట్రేలియా జోడీ ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టినా, గినార్డ్ ద్వయంపై 4-6, 6-3, 10-8తో గెలిచింది.