భారత్ ప్రపంచ వృద్ధికి కీలకంగా ఉందనే దానిని ఉదాహరించేలా ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ పెట్టిన పోస్ట్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వరల్డ్ జీడీపీ లో అమెరికా కంటే భారత్ ముందుందన్నట్లు మస్క్ షేర్ చేసిన స్టాటిస్టిక్స్ ను ఆమె ఉదహరించారు. వరల్డ్ జీడీపీ గ్రోత్ రేటులో చైనా 26 శాతం, భారత్ 17 శాతం, అమెరికా 9.9 శాతం వాటా కలిగిఉందన్నారు. 43 శాతం వృద్ధి రేటు ఇండియా, చైనా నుండే వస్తుందన్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందడానికి ఇదొక మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. భారత్ ఒకవైపు వేగంగా అభివృద్ధి చెందుతుంటే మరోవైపు ప్రతిపక్ష నేతలు విదేశాల్లో భారత ఆర్థిక పరిస్థితులపై విదేశాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే చైనాను కూడా అధిగమించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇక మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఎలాన్ మస్క్ ట్వీట్ పై స్పందించారు. సాధారణంగా భారతీయులు కాని వారు చేసే వ్యాఖ్యలపై నేను స్పందించను. నేను ఎలాన్ మస్క్ మాటలను ప్రస్తావిస్తున్నది కేవలం రాహుల్ గాంధీ గారిని అప్రమత్తం చేయడానికేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ, భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని హితవు పలికారు. భారతదేశ విజయాలను ఎప్పుడూ కించపరచవద్దు. గర్వించదగ్గ భారతీయుడిగా ఉండండని రాహుల్ కు సూచించారు.