రజిని సినిమా లో బాలీవుడ్ బాద్‌షా…!

Spread the love

బాలీవుడ్ బాద్‌షా… ఒక్క అడుగు, ఒక్క డైలాగ్‌తోనే థియేటర్లలో విజిల్స్ పూయించే సూపర్‌స్టార్… ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు అది నిజంగా పండగే కదా. అలాంటి రేర్ సీన్స్ ని ఇప్పుడు ప్రేక్షకులకు అందించేందుకు ఇప్పుడు రజనీకాంత్‌, షారుక్ ఖాన్‌ సిద్ధమవుతున్నారనే వార్తలు సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మన తలైవా రజనీకాంత్‌ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జైలర్ 2’. ఫస్ట్ పార్ట్ సాధించిన ఘన విజయంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్‌ను మరింత పవర్‌ఫుల్ అవతారంలో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ప్రయత్నంలో టీమ్ ఉన్నట్లు సమాచారం.

ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ అదిరిపోయే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారని. గత కొన్ని రోజులుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతుండగా, ఇప్పుడు ఆయన పాత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలు బయటకు వస్తున్నాయి. జైలర్ 2లో షారుక్ ఖాన్ కేవలం ఓ గెస్ట్ అప్పియరెన్స్‌కే పరిమితం కాకుండా, కథలో కీలకమైన పాత్రలో ఉండనున్నారని సోర్సెస్ చెబుతున్నాయి.ఆయన పాత్రకు మంచి వెయిట్ ఉండబోతుందని, ప్రేక్షకులు ఊహించని విధంగా ఆ పాత్ర ప్రభావం ఉంటుందని సమాచారం.రజనీకాంత్‌, షారుక్ ఖాన్‌ ఇద్దరూ కలిసి ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించడమే అభిమానులకు ఒక థ్రిల్ ఫిల్లింగ్ కదా. ఇద్దరి స్టైల్‌, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వీరిద్దరూ ఉండే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని అంటున్నారు.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయినా సరే, ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానుల అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.