బడ్జెట్ నేపథ్యంలో నిన్నటి సెషన్ లో భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాలతో సెషన్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 943 పాయింట్లు లాభంతో 81,666 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 262 పాయింట్లు లాభపడి 25,088 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.91.55గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, ట్రెంట్, టైటాన్ షేర్లు నష్టపోయాయి.