ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజంల అభివృద్ధి హై స్పీడ్ కారిడార్ తో జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. చెన్నై–బెంగళూరు–హైదరాబాద్ మార్గాలు కీలకమైన ఐటీ మరియు ఆర్థిక కేంద్రాలను కలుపుతూ ఒక హై-స్పీడ్ కారిడార్ తో ఏర్పడతాయని . ఈ కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్ల వల్ల ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని పేర్కొన్నారు.హై స్పీడ్ ట్రైన్స్ ఏపీ, తెలంగాణకు గేమ్ ఛేంజర్ గా మారతాయన్నారు. హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరు, పూణేకు 3 హై స్పీడ్ ట్రైన్స్ రానున్నాయి. దీంతో హైదరాబాద్ నుండి బెంగళూరుకు 2గంటల్లో వెళ్ళవచ్చు. పుణేకు 1గంట 55 నిమిషాల్లో, చెన్నైకు 2గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలుస్తోంది. ఈ హై స్పీడ్ ట్రైన్స్ గంటకు 300 కిమీ పైగా వేగంతో ప్రయాణిస్తాయి.