ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు

Spread the love

చరిత్రలో మొదటిసారిగా, జాతీయ భద్రత వంటి తీవ్రమైన అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వడం లేదని రాహుల్ గాంధీ కేంద్రం తీరును తప్పుబట్టారు. అసలు జనరల్ నరవణే ప్రకటన మరియు ఎప్‌స్టీన్ (Epstein) ఉదంతంపై మోదీ గారు ఇంతగా ఎందుకు భయపడుతున్నారు? అని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. నిన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చైనా ఆర్మీ భారత బోర్డర్ లోకి  చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించిందని ఆ వివరాలను రాహుల్ లోక్ సభలో ప్రస్తావించారు.ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ గాంధీ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని.. ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్ నాథ్ ప్రశ్నించారు.  సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాగా, తాజాగా కుదిరిన అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ పైన కూడా రాహుల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మోడీ కాంప్రమైజ్ అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. వాణిజ్య అంశం విషయంలో ప్రధాని మోడీ రాజీపడ్డారు. రైతుల కష్టాన్ని, మొత్తం దేశాన్నే అమ్మేశారని ఆరోపించారు.