అజిత్ పవార్ అంత్యక్రియలలో దొంగల చేతి వాటం..నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 

Spread the love

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇటీవల బారామతి వద్ద జరిగిన  విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆయన  అంత్యక్రియలు గత గురువారం బారామతి విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో జరిగాయి. ఆ సమయంలో కొంతమంది దొంగలు తమ చేతికి పనిచెప్పారు. అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొనగా…అంత్యక్రియల అనంతరం పదిహేను మంది తమ బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు పోగొట్టుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి గురైన వస్తువుల విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నేడు ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.