సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు:ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్

Spread the love

కల్తీ లడ్డూ వ్యవహారంకు సంబంధించి ఏపీ మంత్రులు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం ఇతర మంత్రులతో కలిసి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. ఈ అంశంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు పక్కన పెట్టి మరీ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

తిరుమల లడ్డూలో వినియోగించే  నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా గత వైసీపీ పాలకులు మౌనంగా ఉన్నారని 2022లో వైసీపీ  హయాంలో వచ్చిన సీఎఫ్ ఆర్ నివేదికను కావాలనే తొక్కిపెట్టారని ఫైర్ అయ్యారు. రూల్స్ సడలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు. తిరుమలలో ఇన్ని తప్పులు జరుగుతుంటే గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. 

సీ.ఎఫ్.టీ.ఆర్  నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నివేదిక సూచనల మేరకు చర్యలు తీసుకోని వారిని ఏమనాలి? కల్తీ నిర్ధారణ పరీక్ష వద్దనగానే సడలింపు ఇవ్వటం నేరాన్ని ప్రోత్సహించటమేనని  మండిపడ్డారు. ఏ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడారో గ్రహించాలని  లడ్డూల్లో కొబ్బరి, పందికొవ్వు, పామాయిల్, ఫిష్ ఆయిల్ ఉన్నట్టు ఎన్టీడీబీ నివేదిక ఇచ్చింది. ల్యాబ్ నివేదికలోని ఆ సమాచారం మేరకే  సీఎం మాట్లాడారని తెలిపారు. తెలిసిన వాస్తవాలను సీఎం ప్రజల ముందు పెట్టాలా? వద్దా? అని ప్రశ్నించారు టీటీడీ ప్రక్షాళనలో భాగంగా ఈవోగా శ్యామలరావును నియమించారు. శాంపిల్స్ ను సీఎఫ్ టీఆర్ఎకి అప్పటి ఈవో పంపించారు. 2022లో నివేదిక ఇస్తే దాన్ని సరిచేయకుండా ముందుకెళ్లారు. పాలసేకరణలో 3 రూల్స్ పెట్టారు. 4లక్షల లీటర్ల పాలు సేకరించే సంస్థగా ఉండాలని నిబంధన ఉంది. సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న భోలే బాబా డెయిరీకి వెళ్లారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో  టెండర్లలో పాల్గొన్నారని తెలిసినా మౌనం వహించారు. చుక్క పాలు కూడా  లేకుండా నెయ్యి చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలని  నేరంలో భాగస్వాములపై చర్యలు తీసుకునేందుకే విచారణ కమిషన్ అని స్పష్టం చేశారు.  బ్రిటీష్ పాలకులు, నిజాం కూడా తిరుమల వ్యవస్థలోకి చొరబడలేదని పయ్యావుల అన్నారు. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో పారదర్శక కోసమే ప్రభుత్వ ప్రయత్నమేనని రాజకీయ కోణం ఇందులో లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుమల శ్రీవారి పవిత్రత కాపాడే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు.