ప్రముఖ ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌకగా ప్రసిద్ధి చెందిన గద్దర్ కుమార్తె వెన్నెల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, అలాగే ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చరల్ విభాగానికి ఆయన పేరు పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలను గుర్తు వెన్నెల చేశారు. తమ విజ్ఞప్తులపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారన్న ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గద్దర్ సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.