ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ తన స్థానాన్ని బాగా మెరుగుపరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ లో అతను 32 స్థానాలు ఎగబాకాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 సిరీస్ లో రాణించిన సంగతి తెలిసిందే. ఐదో టీ 20లో ఏకంగా 43 బంతుల్లో 103 బంతుల్లో చేశాడు. మన టీ 20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో నిలిచాడు. జోస్ బట్లర్ మూడో స్థానంలో, తిలక్ వర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. పాతుమ్ నిస్సంక 5వ స్థానంలో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి టాప్ లో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్య 3వ స్థానంలో, శివమ్ దూబే 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.