పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హారీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించేశారు. గబ్బర్ సింగ్ వంటి భారీ విజయం సాధించిన కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇక తాజాగా ఈ మూవీని మార్చి 26న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మన ఉస్తాద్ (USTAAD)ని సెలబ్రేట్ చేసుకోవడానికి.. కేకలు వేయడానికి, ఈలలు కొట్టడానికి, చిందులేయడానికి సిద్ధమవ్వండి!ఈ వేసవిలో, పవర్ స్టార్ (POWER STAR) & కల్ట్ కెప్టెన్ (CULT CAPTAIN) జోడీతో బాక్సాఫీస్ తగలబడిపోవడం ఖాయం. #UstaadBhagatSingh మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.