దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకు కాస్త బ్రేక్ పడింది. నేటి సెషన్ లో ట్రేడింగ్ ను సూచీలు స్వల్ప లాభాలతో ముగించాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ పై టెక్ కంపెనీలు దృష్టి సారించిన నేపథ్యంలో ‘ఆంథ్రోపిక్’ సంస్థ కొత్త ‘AI’ టూల్ ను తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. ఈ ప్రకటనతో అమెరికా ఐటీ సంస్థలే కాకుండా భారత ఐటీ సెక్టార్ షేర్లు కూడా కుప్పకూలాయి. దిగ్గజ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 78 పాయింట్లు లాభంతో 83,817 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 48 పాయింట్లు లాభపడి 25,776 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.44గా కొనసాగుతోంది. ఎటర్నల్, ట్రెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి.