‘పెద్ది’ విడుదల తేదీ ఖరారు 

Spread the love

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘పెద్ది’. ఈ మూవీలో చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ గా  నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ ప్రకటించింది. 2026 ఏప్రిల్ 30న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. వాస్తవానికి ఈ చిత్రాన్నిమార్చి 27న విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ తేదికి మార్చారు.