సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష

Spread the love

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత,  ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. 814హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్ధాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హెల్త్, ఎడ్యుకేషన్ సహా అన్ని రంగాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని సూచించారు. విద్యార్ధుల విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు ఆపార్ ఐడీలను నమోదు చేసి లింక్ చేయాలని సీఎం ఆదేశించారు.