యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Spread the love

మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 1138 కోట్ల చెక్కును అందజేశారు. సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, బోనస్, ఉచిత విద్యుత్ పథకాల గురించి ప్రస్తావిస్తూ, దేశంలోనే రైతుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ నేడు మున్సిపల్ శంఖారావానికి శ్రీకారం చుట్టిందని  రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి సిద్ధం అని యుద్ధం ప్రకటించిందని పేర్కొన్నారు. రెండేళ్ల అభివృద్ధికి, పదేళ్ల అరాచకానికి మధ్య తేడాను గుర్తెరిగిన తెలంగాణ పట్టణాలు ప్రజా పాలనకు జై కొట్టడానికి ఈ రోజు “ప్రజా పాలన – ప్రగతి బాట” సభ నాంది పలికిందని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.