నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ, డిచ్ పల్లి లో ఎస్సీ బాలురు & బాలికల హాస్టళ్ల నిర్మాణం.తెలంగాణ యూనివర్సిటీ లో ఇండోర్ స్టేడియం నిర్మాణం. తెలంగాణ యూనివర్సిటీ, డిచ్ పల్లి లో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ లో ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనం విస్తరణకు శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్వాయిలో సిబ్బంది నివాస గృహాలు, అదనపు సౌకర్యాల నిర్మాణం. ఆర్మూర్, బోధన్ మరియు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం.నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోలా రోడ్డు, పీడబ్ల్యూడీ & జేఎన్ఎన్ రోడ్డు నుండి సిరన్పల్లి మీదుగా నిజాంపూర్ వరకు రోడ్డు వెడల్పు పనికి శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాలకు రూ.200 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కుల పంపిణీ చేశారు.