పరీక్షల కోసం రెడీ అవుతున్న విద్యార్థుల కోసం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు ఫెస్టివల్ లాంటివని వాటిని ఒక వేడుకగా జరుపుకోవాలని వారికి సూచించారు. మార్కులపై వ్యామోహం వదిలి లైఫ్ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. విద్యను భారంగా చూడవద్దని పోయిన సంవత్సరం ఫస్ట్ వచ్చిన విద్యార్థి పేరు ఇప్పుడు ఎవరికీ గుర్తుండదు. మార్కులకు అంత ప్రాధాన్యత లేదని దీనిని బట్టి అర్ధమవుతుంది. జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు విద్య ఒక మార్గం మాత్రమేనని స్పష్టం చేశారు. పరీక్షల కోసమే మన జీవితం లేదు. ఫైనల్ టార్గెట్.. మార్కులు కారాదని సంపూర్ణ జీవన వికాసమే కీలకమని పేర్కొన్నారు. విద్యతో పాటు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంపైనా దృష్టి పెట్టాలన్నారు. నచ్చిన రంగంలో దూసుకెళ్లాలని సూచించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, వివిధ రాష్ట్రాల బోర్డు పరీక్షలు సమీపిస్తున్న వేళా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తాను అంచెలంచెలుగా ప్రధానిగా ఎదిగిన విషయాన్నీ ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో పంచుకున్నారు. ఇప్పుడు కూడా తనకు చాలా మంది సూచనలు, సలహాలు ఇస్తుంటారని తన అభిప్రాయం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా పనిచేస్తుంటారని విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధానాలు కూడా బిన్నంగా ఉంటాయన్నారు. అందరి సలహాలు తీస్కుకోండి అయితే చివరిగా మీకు అత్యంత అనువుగా ఉండే విధానాన్ని అనుసరించాలని విద్యార్థులకు ప్రధాని సూచించారు.