ఈ మార్పు యాదృచ్ఛికం కాదు-ఇది కేసీఆర్ గారి వ్యవసాయ విప్లవం:కె.టి.ఆర్

Spread the love

వ్యవసాయం నిలబడితేనే గ్రామం నిలబడుతుందని,గ్రామం నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందనికేసీఆర్ గారు మాటలతో కాదు భూమి మీద ఫలితాలతో నిరూపించారని బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ అన్నారు. ఒకప్పుడు కరువుతో,ఉపాధి లేక తెలంగాణ నుంచి వలస వెళ్లిన ప్రజలు…ఈరోజు దేశం నలుమూలల నుంచి వలసలను తెలంగాణ ఆదుకుంటుందన్నారు. ఈ మార్పు యాదృచ్ఛికం కాదు-ఇది కేసీఆర్ గారి వ్యవసాయ విప్లవమని పేర్కొన్నారు. నీళ్లు లేక పొలాలు ఎండిపోయిన రోజుల్లో వ్యవసాయం అంటే నష్టం అనే భావన ఉండేదని కానీ కేసీఆర్ గారు నీళ్లే జీవనాడి అని గుర్తించి కాళేశ్వరం వంటి చారిత్రక ప్రాజెక్టులతో రైతు పొలానికి శాశ్వత భరోసా ఇచ్చారని తెలిపారు. నీళ్లు వచ్చి పంటలు పెరిగాయని పని పెరిగితే వ్యవసాయ కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి లభించిందన్నారు. అందుకే ఈరోజు తెలంగాణబిహార్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు ఉపాధి కల్పించే దేశంలోని ప్రధాన వ్యవసాయ కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రైతుబంధు ద్వారారైతుకు ముందే పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అదే పెట్టుబడి సాగును పెంచిందని సాగు పెరిగితే రైతు నిలబడ్డాడు…కార్మికుడు బతికాడు.గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడిందని ‘ఎక్స్’ లో తన పోస్ట్ లో పేర్కొన్నారు. రైతుకు భరోసా ఇచ్చిన నాయకుడే,కార్మికుడికి ఉపాధి ఇచ్చిన నాయకుడు అతనే కేసీఆర్ అని స్పష్టం చేశారు.ఇది పార్టీ మాట కాదు.ఇది పత్రికలు రాస్తున్న నిజం.పొలాల్లో పండుతున్న పంటలు సాక్ష్యం.పనిలో ఉన్న వలస కార్మికులే సాక్ష్యమని పేర్కొన్నారు. ఒక పత్రికలో వచ్చిన అంశాన్ని తన పోస్ట్ కు జత చేశారు.