ముంబై మేయర్ పదవికి అభ్యర్థిగా మహాయుతి కూటమి బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే ని ఖరారు చేసింది. ఈమేరకు బీజేపీ నేత అమిత్ సతమ్ ప్రకటించారు. పార్టీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా బీజేపీ సీనియర్ నేత అయిన రితూ మూడుసార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ విద్యా కమిటీ అధ్యక్షురాలిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కూటమి అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ పదవికి గానూ శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 11న ఈ మేయర్ ఎన్నిక జరగనుంది. కాగా, బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో 227 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. 118 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. ఇక ఉద్దవ్ శివసేన 65, మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6, శరద్ పవార్ ఎన్సీపీ 8, అజిత్ పవార్ ఎన్సీపీ 3,సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకున్నాయి.