అగ్ని-3 బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్రాలు మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఒడిశా తీరానికి దగ్గరలోని చాందీపూర్ నుండి ఈ ప్రయోగం జరిగింది. సర్ఫేస్ టు సర్ఫేస్ టార్గెట్ ను ఛేదించగల ఈ అస్త్రం రేంజ్ 3వేల కిలోమీటర్లకు పైనేనని తెలుస్తోంది. నిర్దేశిత మార్గంలో ప్రయాణిస్తూ బంగాళాఖాతంలోని టార్గెటెడ్ ప్రాంతంపై పడింది. ఇక అక్కడికి చేరువలో మోహరించిన షిప్ లు దీనిని రికార్డు చేశాయి. ఈ ప్రయోగానికి చెందిన అన్ని టార్గెట్లు నెరవేరయని రక్షణా రంగ పరిశోధనా సంస్థ డీ.ఆర్.డీ.వో వర్గాలు తెలిపాయి. తీరప్రాంతాల్లోని రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్ ఈ మిస్సైల్ ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాయి. అడ్వాన్స్డ్ మిస్సైల్ అయిన అగ్ని-3 ఇప్పటికే భారత సైనిక దళాల అమ్ములపొదిలో చేరింది. ఇది 1.5 టన్నుల పేలోడ్ ను మోసుకుపోగలదు. దీని పొడవు 17మీటర్లు.