కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

Spread the love

ఈ రోజు రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో కలిసి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ 2026–27 పై మీడియా సమావేశంలో మాట్లాడారు.  ప్రజల ఆశయాలకు అనుగుణంగా, అన్ని రాష్ట్రాల అవసరాలను సమతుల్యంగా పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ప్రజా కేంద్రిత బడ్జెట్ ఇది. తయారీ, సేవలు, రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం స్థిరమైన వృద్ధి మరియు ఉపాధి అవకాశాల గురించి పేర్కొన్నారు. పౌర విమానయానాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ 2026–27 లో ప్రధానంగా ఎమ్.ఆర్.ఓ  రంగాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం, మరియు పర్యాటకం మరియు వ్యాపార వృద్ధికి మద్దతు ఇవ్వడం వంటి చర్యలపై రామ్మోహన్ నాయుడు ప్రస్థావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలనతో అభివృద్ధి వెనక్కి వెళ్లిపోతే తిరిగి 18 నెలల్లో బ్రాండ్ ఏపీ గా తీర్చిద్దుకున్నాము. అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్, రేర్ ఎర్త్ కారిడార్, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి లభిస్తున్న మద్దతు దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతి మరియు కనెక్టివిటీకి బలాన్నిస్తుందని స్పష్టం చేశారు. భారత దేశ అభివృద్ధి పథాన్ని మరింత బలపరిచే చారిత్రాత్మక బడ్జెట్‌ను అందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.