నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం

Spread the love

నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని సీజ్డ్ ప్రాపర్టీస్ రూమ్ లో  ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫోరెన్సిక్ బిల్డింగ్  చాలా పాతదని, దీనిని 1980లలో నిర్మించారని తెలిపారు. చివరి గదిలో ఉన్న స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలిపారు. అక్కడి నుంచి మంటలు వ్యాపించాయని, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని వివరించారు. హైదరాబాద్‌లోని అన్ని భవనాలను తనిఖీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యాలయాలను తనిఖీ చేస్తామని అన్నారు. వేసవి కాలం  సమీపించిన నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.