ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హెప్టాథ్లాన్ పురుషుల విభాగంలో అతను 5993 పాయింట్లతో టాప్ లో నిలిచి టోర్నీలో భారత్ కు మొదటి పసిడిని అందించాడు. భారత్ 5 మెడల్స్ తో టోర్నీని ముగించింది. పూజ (హైజంప్, సిల్వర్), తజిందర్ పాల్ సింగ్ (షాట్ ఫుట్, సిల్వర్), ఎన్సీ సోజాన్ (లాంగ్ జంప్, బ్రాన్జ్), ఆదర్శ్ జోతి శంకర్ (హైజంప్, బ్రాన్జ్) మెడల్స్ సాధించారు.
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత మిక్సెడ్ టీమ్ సత్తా చాటింది. ఒలింపియన్స్ ఇలవేనిల్-అర్జున్ బబుతా ద్వయం గోల్డ్ మెడల్ సాధించింది. తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సెడ్ టీమ్ ఫైనల్ లో 505.5తో ఈ జోడీ టాప్ లో నిలిచింది.