పాక్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ

Spread the love

భారత్-శ్రీలంకల వేదికగా టీ 20 ప్రపంచ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ భారత్ తో ఆడకూడదని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగించిందని భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ అన్నాడు. వరల్డ్ కప్ ఒక మ్యాచ్ ఆడకపోవడం ఏంటి? పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. ఈ టోర్నీలో ప్రతి పాయింట్ చాలా ముఖ్యం అని అన్నాడు. ఇక భారత జట్టుకు ఒక సలహా ఇచ్చాడు. అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ లో మొదట్లోనే కీలక వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, మొదటి బాల్ నుండి బడుతూనే ఉండాలన్నాడు. భారత్ లో క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. చాలా నెలలుగా దూకుడుగానే ఆడుతున్నారని అన్నారు. బాదే క్రమంలో ఒక్కోసారి తడబడే అవకాశాలుంటాయన్నాడు. అయితే అలాగని గేమ్ ప్లాన్ మార్చుకోకూడదన్నాడు. ఎప్పటిలానే ఆడాలని భారత జట్టు చాలా బలంగా ఉందన్నారు. అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు. ప్రపంచకప్ ముందుకుసాగే కొద్దీ టీమ్ జోరందుకుంటుందన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తానొక మ్యాచ్ విన్నర్ అని మరోసారి నిరూపించుకున్నాడని పేర్కొన్నారు.