పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేశారు. 92 మంది విద్యార్ధులకు డయేరియా లక్షణాలు కనిపించటంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కు తరలించినట్టు అధికారులు వివరించారు. అందరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, స్పెషల్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్ధాల, నీటి నమూనాలు కూడా సేకరించామని పేర్కొన్నారు. ఘటనపై పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ ను సీఎం అదేశించారు. ఘటనకు కారకులపై శాఖా పరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.