ఏపీలో కాస్త పెరిగిన ఎండలు

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత మెల్లగా పెరుగుతోంది. ఇంకా శీతాకాలం పూర్తికాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కావలిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు నమోదైంది. బాపట్ల, ఒంగోలు, కావలి, నరసాపురం తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా,యానాం లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు ఎక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవొచ్చనే అంచనా వేస్తోంది. ఇక రాయలసీమలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గొచ్చని తెలిపింది.