ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ లో బిల్లు పెట్టిన నేపథ్యంలో తదితర అంశాలపై విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశమయ్యారు. కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అనుమతులు వంటి అంశాలపై ఆమెతో చర్చించారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఎంపీలు, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు.