కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పార్లమెంట్ లో ఫిబ్రవరి 4న జరిగిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. తమ ఎంపీల అత్యంత నీచమైన ప్రవర్తన పట్ల కాంగ్రెస్ పార్టీ గర్వపడుతోంది!! పార్లమెంటు గౌరవాన్ని మరియు పవిత్రతను కాపాడటంపై మాకు చాలా ఉన్నతమైన గౌరవం ఉంది.” గౌరవనీయులైన ఎంపీల నుండి ఇటువంటి ప్రవర్తనను ఎవరు మాత్రం సమర్థించగలరు? ఎంపీల నుండి ఇటువంటి ప్రవర్తనను ఎవరు మాత్రం సమర్థించగలరు? సభ యొక్క గౌరవాన్ని మనం కాపాడాలని, మొరటుగా ప్రవర్తించే ప్రతిపక్ష ఎంపీలతో ఏ బిజెపి ఎంపీ కూడా భౌతిక ఘర్షణకు దిగకూడదని మా నాయకత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రధాని మోడీని చుట్టుముట్టే అవకాశం ఉందని ఆరోజు ప్రధాని సభకు రావొద్దని సూచించినట్లు తెలుస్తోంది.