ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ‘రాజకీయ హత్యే’:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Spread the love

మఖ్తల్ బీజేపీ వార్డ్-6 అభ్యర్థి, యువ గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప గారి మృతి కలిచివేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ‘రాజకీయ హత్యే’. ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే రాహుల్ గాంధీ, ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ గుండాలు పట్టపగలే ప్రజాస్వామ్యం గొంతు కోస్తున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ నాయకులు, వారి గూండాలు మాఫియా తరహాలో చేసిన బెదిరింపులు, ఒత్తిళ్లే ఒక సామాన్య గిరిజన బిడ్డను బలితీసుకున్నాయని ఆక్షేపించారు. గిరిజన సమాజంపై కాంగ్రెస్ చూపిస్తున్న ఈ వివక్షకు, అరాచకానికి అంతం తప్పదు. మహాదేవప్ప కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మహాదేవప్ప కుటుంబానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ అరాచక ప్రభుత్వంపై మా పోరాటం ఆగదని కిషన్ రెడ్డి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.