ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో లోకేష్ భేటీ..కీలక అంశాల చర్చ

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఆసక్తికర  పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఐటీ, హెచ్.ఆర్.డి. శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు  శాసన సభలోని ఉపముఖ్యమంత్రి పేషీలో జరిగిన భేటీలో ఇరువురు నేతలు శాసన సభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాష్ట్ర ఆర్ధిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశమయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ గారిని కలవడం చాలా సంతోషంగా అనిపించింది. బడ్జెట్ సమావేశాల ప్రణాళిక మరియు ముందున్న ప్రాధాన్యతలపై సుదీర్ఘంగా చర్చించినట్లు లోకేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో, మా ప్రభుత్వ దార్శనికతను నిర్ణయాత్మక చర్యలుగా మార్చడానికి కట్టుబడి ఉన్నాము. ఒక ఐక్య కూటమి (NDA) బృందంగా.. స్పష్టత, సమన్వయం మరియు నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సుపరిపాలనకు మరియు ఉజ్వల భవిష్యత్తును అందించడానికి మేము కృషి చేస్తామని లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.