ఇంట్రెస్టింగ్ గా ‘స్వయంభు’ టీజర్

Spread the love

‘స్వామిరారా’, ‘కార్తికేయ’-1, కార్తికేయ-2 ఇలా ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటూ విభిన్న కథాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించే నటుడు నిఖిల్. ఆయన ప్రధాన పాత్రలో భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్వయంభు. సంయుక్త, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా దీని టీజర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఇదివరకెన్నడూ చూడని సరికొత్త యోధుడి పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నారు. టీజర్ లో విజువల్స్, డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు నటీనటుల నటన మూవీపై అంచనాలు పెంచేశాయి. ఒక్క ప్రాణం కూడా పోకుండా యుద్ధం నిలవదు కృష్ణా అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.