టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ వరుసగా రెండో గెలుపును కైవసం చేసుకుంది. తాజాగా గ్రూప్-సి మ్యాచ్ లో ఆ జట్టు 30 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది.మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రూథర్ఫర్డ్ 76 నాటౌట్; (42; 2×4, 1×6) రాణించాడు. రోస్టన్ ఛేజ్ 34 (29; 6×4), జేసన్ హోల్డర్ 33 (17; 1×4, 4×6), హెట్మెయర్ (23) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 2 వికెట్లు, సామ్ కరన్ 1 వికెట్, ఆర్చర్ 1 వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. సామ్ కరన్ 43 నాటౌట్ (30; 3×4, 2×6), జాకోబ్ బెథెల్ 33 (23; 4×4,1×6), ఫిలిప్ సాల్ట్ 30 (14; 4×4, 2×6), జాస్ బట్లర్ 21 (14; 2X4, 1X6) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్ బౌలర్లలో మోటీ 3 వికెట్లు, రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు, షెపర్డ్, జోసెఫ్, హొసేన్ ఒక్కో వికెట్ తీశారు.
వెస్టిండీస్: 196-6 (20).
ఇంగ్లాండ్ :166-10 (19).